This is the message that was read at the Dawn to Dusk Dance and Music Performance on JUne 24, 2012 by the students of Tyagaraja Sangeetha Nritya Kalaniketan, an affiliate of Bharathi Theertha
ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. సభా భారతి కి నమస్కారం. సభా వేదికను అలకరించిన పెద్దలందరికీ మనస్సుమాన్జులలు. పేరుపేరునా సంబోధించి ఈ సంగీత నృత్య మహా సభకు విచ్చేసిన అతిదుల్లన్దరికీ నా శుభాకాంక్షలు ప్రత్యక్షంగా తెలుపడానికి నా మనస్సు ఎంతో తపిస్తున్నా , పదిహేనువేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో వున్న నేను ఆ పనిని చేయలేక పోతున్నానని కించ పడుతున్నాను . 80 G కోవకు చెందిన భారతీ తీర్థ అనుబంధ సంస్థగా, మా తాత గారు , మహామహోపాధ్యాయ, కళా ప్రపూర్ణ, వ్యాకరణ శిరోమణి బ్రహ్మశ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి గారు నిర్మించిన గృహంలో ఆనాడు వేద ఘోష, సంస్కృత ఘోష జరుగగా , గత ఎనిమిది సంవత్సరాలుగా ఏ లాభాన్ని ఆశించకుండా, శాస్త్రీయ సంగీత మరియు నాట్య ఘోష పోషణకి, ఈనాడు కృషి చేస్తున్న వరలక్ష్మి త్యాగరాజ సంగీత నృత్య కళా నికేతన్ ప్రధాన దర్సకురాలైన శ్రీమతి మహేంద్రవాడ లక్ష్మికి , ఎంతో సాదరంగా అభిమానం తో ఈ కళాశాలలో చిన్నారులికి శిక్షణ ఇస్తున్న అధ్యాపకులకీ, నా ధన్యవాదాలు, ఆశీస్సులు కూడా .

స్వాతంత్రానికి ముందు విజయనగరంలో సంగీతానికి, సాహిత్యానికి ఎంతో పోషణ వున్న రోజులవి. క్రమేణా అది తగ్గుతూనే వస్తోంది. ఈనాడు విజయనగరంలో కాస్త సంగీతానికి నృత్యానికి ఉనికి అన్నది ఉన్నదంటే దానికి కారణం , ఎప్పుడో నిర్మించిన కాస్త ప్రభుత్వ పోషణ ఉన్న మహారాజ సంగీత నృత్య కళాశాల, మరియు దరిమిలా పట్టుదలతో పాటు పడుతున్న ఏ ప్రభుత్వ పోషణ లేనటువంటి త్యాగరాజ సంగీత న్రిత్య కళా నికేతన్, తదితర లాంటి సంస్థలే కారణమని నా అభిప్రాయం . ఆదిభట్ల నారాయణ దాసు, ద్వారం వెంకటస్వామి నాయుడు, వీణ రామదాసు లాంటి మహా సంగీత విద్వాంసులు మళ్ళా ఇప్పుడు ఈ కళా రంగాలలో కృషి చేస్తున్న సంస్తల్లోంచి రావాలంటే ప్రభుత్వ పోషణ మరియు ముఖ్యంగా ప్రజా పోషణ ఎంతైనా ఈ సంస్థలకి అవసరం. సభకు విచ్చేసిన ప్రజా ప్రతినిధులను, ప్రజా సేవకై నియమంచబడిన ప్రభుత్వ అధికారులను నేను చేసే మనవి ఏమంటే, ఈ సంస్థలకు మీరు చేయూత నిచ్చి, కళా విద్యకి కేటాయించిన నిధులను కేటాయించి కళా రంగం లో కోల్పోయిన అగ్రస్థానాన్ని విజయనగరానికి మళ్ళా వచ్చేలాగ చెయ్యండి . మీరు తలచుకుంటే ఏ పనైనా చేయగలరు. ప్రభుత్వమే అన్నీ చేయలన్నా, అది కష్టమే. విజయనగరంలో ప్రొద్దున్న లేచిన దగ్గరనుండి దాని గాలిని పీలుస్తూ, దాని నీళ్ళు త్రాగుతూ , దాని వల్లే లాభాలు పొందుతున్న ప్రజలు కూడా విజయనగర ప్రగతికి తోడ్పడాలి. "నాకెందుకులే, ప్రభుత్వ అధికారులున్నరుగా వాళ్ళే చేస్తారులే, నాకిందులో ఏ లాభం లేదు కదా," అన్న భావం విజయనగర ప్రగతికి మంచిది కాదేమో?!
ప్రవాస విజయనగారవాసులైన మాకు, మేము పుట్ట్టిన విజయనగరం మీద, ఎంతో మమకారం. మాకు చేతనంతైన పని అయితేగాని, సహాయం అయితే గాని మేము విజయనగర ప్రగతికి చేస్తామని మీకు హామీ ఇస్తున్నాము. అయితే, మీరు కూడా మాతో సహకరించాలి. మేము ఏ పనైనా చేస్తే అది సవ్యంగా జరిగే బాధ్యత మీరు తీసుకుంటే మేము తయారుగానే ఉంటాము కదా !
ఈ రోజున ఉదయంనుండీ సాయంత్రం వరకు జరుగుతూన్న ఈ నిర్విరామ నృత్య గాన ప్రదర్సన మీ అందరికి ఉత్సాహం, ఉల్లాసం, ఉద్రేకం, ఉదారత్వం కల్పించి భారతీ తీర్థ మరియు వరలక్ష్మి త్యాగరాజ సంగీత న్రిత్య కళా నికేతన్ చేస్తున్న కార్యక్రమాలకి చేయూతనిస్తారని భావిస్తున్నాను. గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి త్యాగరాజ సంగీత నృత్య కళా నికేతన్ పేరు ఎక్కాలని ఆ కళా భారతిని ప్రార్ధిస్తున్నాను .
ఆ భారతి మీకు,మీ కుటుంబాలను ఎల్ల వేళల సుఖ శాంతులను ఇస్తూ బ్రోవాలని కోరుతూ,
మీ వాడు,
డా. తాతా ప్రకాశం.